సిరిసిల్ల వరద బాధితులకు రూ. 10 లక్షల సాయం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.) అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఆకాల వర్షాలతో నష్టపోయిన సిరిసిల్ల జిల్లా
బండి సంజయ్


హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)

అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఆకాల వర్షాలతో నష్టపోయిన సిరిసిల్ల జిల్లా ప్రజలను ఆదుకునేందుకు రూ.10 లక్షల రూపాయలను అందజేయనున్నట్లు ప్రకటించారు. ఎంపీ లాడ్స్ నిధుల నుండి ఈ మొత్తాన్ని సంబంధిత సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు త్వరలోనే అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆకాల వర్షాలతో సిరిసిల్ల జిల్లాలో భారీ ఎత్తున నష్టం సంభవించిందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించిందని, పలువురు నిరాశ్రయులయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ లాడ్స్ నిధుల మొత్తాన్ని సిరిసిల్ల జిల్లా బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande