అనంతపురం జిల్లా తాడిపత్రిలో గణేష్ శోభా యాత్ర లో.జేసు. ప్రభాకర్ రెడ్డి కాకర్ల రంగనాథ్ అనుచరుల మధ్య.ఘర్షణ
తాడిపత్రి, 31 ఆగస్టు (హి.స.) : అనంతపురం జిల్లా తాడిపత్రిలో గణేశ్‌ శోభాయాత్ర సందర్భంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్‌ అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. శోభాయాత్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో గణేష్ శోభా యాత్ర లో.జేసు. ప్రభాకర్ రెడ్డి కాకర్ల రంగనాథ్ అనుచరుల మధ్య.ఘర్షణ


తాడిపత్రి, 31 ఆగస్టు (హి.స.)

: అనంతపురం జిల్లా తాడిపత్రిలో గణేశ్‌ శోభాయాత్ర సందర్భంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్‌ అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. శోభాయాత్ర సందర్భంగా ఆసుపత్రిపాలెం వద్ద కాకర్ల రంగనాథ్ వర్గీయులకు చెందిన విగ్రహం నిదానంగా వెళ్తుండటంతో.. కాస్త వేగంగా వెళ్లాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. దీంతో ఆగ్రహించిన రంగనాథ్‌.. ప్రభాకర్‌రెడ్డిని దూషించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘర్షణ చోటు చేసుకున్నట్టు సమాచారం. రాళ్ల దాడిలో రంగనాథ్‌కు చెందిన ఐషర్‌ వాహనం, లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు తిరిగి శోభాయాత్ర కొనసాగించారు. ఎన్నికల ముందుకు కాకర్ల రంగనాథ్‌ వైకాపా నుంచి తెదేపాలో చేరారు. ఎన్నికల అనంతరం ప్రభాకర్‌రెడ్డి, రంగనాథ్‌ వర్గాల మధ్య వివాదం తలెత్తింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande