పార్వతీ.పురం. మన్యం జిల్లా ప్రభుత్వ. జూనియర్ కళాశాల.మైదానంలో ఎస్పీ మాధవ రెడ్డి సైక్లింగ్ ప్రారంభించారు
అమరావతి, 31 ఆగస్టు (హి.స.) పార్వతీపురం పట్టణం: సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణంలో కాలుష్యం తగ్గించవచ్చని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఫిట్ ఇండియాలో భాగంగా సండే సైక్లింగ్‌ను ఎస
పార్వతీ.పురం. మన్యం జిల్లా ప్రభుత్వ. జూనియర్ కళాశాల.మైదానంలో ఎస్పీ మాధవ రెడ్డి సైక్లింగ్ ప్రారంభించారు


అమరావతి, 31 ఆగస్టు (హి.స.)

పార్వతీపురం పట్టణం: సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణంలో కాలుష్యం తగ్గించవచ్చని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఫిట్ ఇండియాలో భాగంగా సండే సైక్లింగ్‌ను ఎస్పీ ప్రారంభించారు. మైదానం నుంచి పాత బస్టాండ్ వరకు.. అక్కడి నుంచి బైపాస్ రోడ్డు మీదుగా మైదానానికి సుమారు ఆరు కిలోమీటర్లు ఎస్పీ సైకిల్ తొక్కారు. ఆయనతో పాటు పోలీసు అధికారులు విద్యార్థులు యువత పాల్గొన్నారు. ప్రస్తుత రోజుల్లో వాహనాల వినియోగం పెరగడంతో కాలుష్యం ఎక్కువ అవుతోందని.. సైక్లింగ్ చేయడం వల్ల కాలుష్య నియంత్రణకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు పర్యావరణాన్ని రక్షించవచ్చని ఎస్పీ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande