నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద హైటెన్షన్..
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.) నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. బిహార్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ అధికారి యాత్రలో ప్రధాని నరేంద్రమోదీ తల్లిని అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం
బిజెపి ఆఫీస్


హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)

నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర

కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. బిహార్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ అధికారి యాత్రలో ప్రధాని నరేంద్రమోదీ తల్లిని అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా నేతలు పార్టీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మోదీ తల్లిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. వారిని వారించే ప్రయత్నం చేయగా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి, బీజేపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande