జెట్‌ ఇంజిన్లను తయారుచేస్తాం
న్యూఢిల్లీ,31 ,ఆగస్టు (హి.స.) నొయిడా: ఉగ్రవాదం, ప్రాంతీయ సంఘర్షణలు, వాణిజ్య యుద్ధాలతో నిండిపోయిన ప్రస్తుత కాలంలో విదేశీ సరఫరాలపై భారత రక్షణ రంగం ఆధారపడటం మంచిది కాదని, దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడటంలో సైనిక స్వావలంబన అత్యంత కీలకమైనదని రక్షణ
Rajnath


న్యూఢిల్లీ,31 ,ఆగస్టు (హి.స.) నొయిడా: ఉగ్రవాదం, ప్రాంతీయ సంఘర్షణలు, వాణిజ్య యుద్ధాలతో నిండిపోయిన ప్రస్తుత కాలంలో విదేశీ సరఫరాలపై భారత రక్షణ రంగం ఆధారపడటం మంచిది కాదని, దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడటంలో సైనిక స్వావలంబన అత్యంత కీలకమైనదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన దిల్లీలో ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన రక్షణ సదస్సులో ప్రసంగించారు. ప్రతిపాదిత సుదర్శన చక్ర గగనతల రక్షణ వ్యవస్థను రానున్న 10 ఏళ్లల్లో పూర్తిగా అభివృద్ధిచేసి, దీనిని దేశంలోని కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు. శక్తిమంతమైన స్వదేశీ జెట్‌ ఇంజిన్లను అభివృద్ధిచేసే సవాలును భారత్‌ స్వీకరించిందని, ఈ కీలకమైన ప్రాజెక్టుకు సన్నాహాలు పూర్తయ్యాయని, అతి త్వరలోనే దీని ఫలితాలు కనిపిస్తాయని రాజ్‌నాథ్‌ తెలిపారు.

‘‘భారత్‌ ఎవరితో శత్రుత్వాన్ని కోరుకోదు. కానీ తన ప్రయోజనాల విషయంలో రాజీపడదు. దేశ ప్రజలు, రైతులు, చిరువ్యాపారుల సంక్షేమమే మాకు ప్రాధాన్యం. భారత్‌ను ఎంత ఒత్తిడికి గురిచేస్తే అంత ఎత్తుకు ఎదుగుతుంది’’ అంటూ అమెరికా విధిస్తున్న సుంకాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande