మణిపూర్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, 2 సెప్టెంబర్ (హి.స.) ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 13వ తేదీన మణిపూర్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. తొలుత ఆయన మిజోరంలో పర్యటిస్తారని ఐజ్వాల్లోని అధికారులు వెల్లడించారు. బైరాబి-సైరంగ్ రైల్వే లైన్ను ప్రారంభించేందుకు ఆయన మిజోరం వెళ్తారు. 2023 మ
ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, 2 సెప్టెంబర్ (హి.స.)

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 13వ తేదీన మణిపూర్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. తొలుత ఆయన మిజోరంలో పర్యటిస్తారని ఐజ్వాల్లోని అధికారులు వెల్లడించారు. బైరాబి-సైరంగ్ రైల్వే లైన్ను ప్రారంభించేందుకు ఆయన మిజోరం వెళ్తారు. 2023 మే నెలలో రెండు వర్గాల మధ్య మణిపూర్ ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. విధ్వంసకరంగా మారిన ఆ ఘర్షణ నేపథ్యంలో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మణిపూర్కు ఎందుకు వెళ్లడం లేదని విపక్షాలు ప్రశ్నించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం .. మజోరం, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించే అవకాశాలు ఉన్నట్లు ఐజ్వాల్ అధికారుల ద్వారా తెలుస్తోంది. కానీ ప్రధాని మోదీ పర్యటనకు చెందిన తుది షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాలేదన్నారు. ఇంపాల్లో ఉన్న అధికారులు మాత్రం మోదీ టూరు గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.

మిజోరం చీఫ్ సెక్రటరీ ఖిల్లి రామ్ మీనా వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ రాక కోసం భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సెక్యూర్టీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, రిసెప్షన్, స్ట్రీట్ డెకరేషన్ లాంటి అంశాలపై చర్చించారు. ఐజ్వాల్ సమీపంలోని లామౌల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్నది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande