రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నిరసన
తెలంగాణ, జోగులాంబ గద్వాల. 31 ఆగస్టు (హి.స.) దేశ ప్రధానమంత్రి మోడీ తల్లిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని బీజేవైఎం రాష్ట్ర నాయకులు రాజశేఖర్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ.. జోగులాంబ గద్వా
బిజెపి నాయకుల నిరసన


తెలంగాణ, జోగులాంబ గద్వాల. 31 ఆగస్టు (హి.స.)

దేశ ప్రధానమంత్రి మోడీ తల్లిపై

రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని బీజేవైఎం రాష్ట్ర నాయకులు రాజశేఖర్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ.. జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయుటకు బీజేపీ నాయకులు ముందుకు వచ్చారు. రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

దిష్టిబొమ్మ దగ్ధం చేయకుండా పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాస్త రసాభాసాగా మారింది. దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి వచ్చిన బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దేశ ప్రధాని పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే వారందరిని ఎందుకు అరెస్టు చేయడం లేదని.. సాదాసీదాగా నిరసన తెలిపి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి కూడా ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు న్యాయం అని రాజశేఖర్ శర్మ ప్రశ్నించారు. నిరసనకు ముందే చాలా మంది బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande