హైదరాబాద్ కు నేడు ఉపరాష్ట్రపతి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థి రాక
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.) ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ కు వస్తున్నారని కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎం
జస్టిస్ సుదర్శన్ రెడ్డి


హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ కు వస్తున్నారని కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ లు, నాయకులు స్వాగతం పలుకుతారని వారు తెలిపారు. కాగా రేపు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీలు హాజరు కావాలని మల్లు రవి కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande