న్యూఢిల్లీ,31 ,ఆగస్టు (హి.స.): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’ 125వ ఎపిసోడ్‌లో యూపీఎస్‌సీ పోర్టల్ ‘ప్రతిభా సేతు’ను ప్రశంసించారు, యూపీఎస్‌సీ అభ్యర్థులకు ఇది ఆశాదీపం అని అభివర్ణించారు.
వేలాది మంది యూపీఎస్‌సీ అభ్యర్థులకు సహాయపడుతున్న ‘ప్రతిభా సేతు’ చొరవను ప్రతిభకు వారధిగా మోదీ పేర్కొన్నారు. యూపీఎస్‌సీ పరీక్షలలోని అన్ని దశలలో ఉత్తీర్ణులై, తుది మెరిట్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిన అభ్యర్థులకు ‘ప్రతిభా సేతు’ తగిన వేదిక అని అన్నారు. ఈ పోర్టల్ యూపీఎస్‌సీలోని వివిధ పరీక్షల అన్ని దశలలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల డేటాను స్టోర్ చేస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల యజమాన్యాలు ప్రతిభా సేతు పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. అప్పుడు వారు అభ్యర్థుల డేటాబేస్‌ను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది.ఇది అభ్యర్థుల నియామకానికి ఉపయోగపడుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ