మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.) మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆదివారం అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా బిల్లు అమలుకు సభ సభ్యులంతా ఆమోదం తెలిపారు. దీంతో మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ఆమోద
అసెంబ్లీ


హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)

మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆదివారం అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా బిల్లు అమలుకు సభ సభ్యులంతా ఆమోదం తెలిపారు. దీంతో మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ సభ ముఖంగా పేర్కొన్నారు.

ఇక సభలో రిజర్వేషన్ల అంశంపైనా వాడీవేడీగా చర్చ సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత కేటీఆర్ సైతం చర్చించారు. అంతకుముందు రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు అన్ని పార్టీలు మద్దతు పలికాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande