తెలంగాణ, మంచిర్యాల. 31
తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ లో జరిగిన 12.61 కోట్ల విలువగల బంగారం చోరీ కేసు ను చేదించినట్టు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు. ఈ కేసు లో 44 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘటన జరిగిన వారం రోజుల్లో కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి 15.237 కిలోల బంగారం, రూ.1,61,730 నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. చెన్నూరు ఎస్బిఐ బ్యాంక్ లో చోరీ జరిగన సంఘటనపై ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఫిర్యాదు చేశారు. నిందితులలో ఎస్బీఐ బ్రాంచ్ క్యాషియర్ రవీందర్, బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్లతోపాటు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల మేనేజర్లు, సిబ్బంది, స్థానికులు ఉన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు