హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)
నేడు, రేపు .. ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పపీడన ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, యాదాద్రి, హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
సెప్టెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకూ.. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, జనగామ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..