యూరియా కోసం బారులు తీరిన రైతులు.. రైతు వేదికల వద్ద తోపులాట
మెదక్, 31 ఆగస్టు (హి.స.) గత 15 రోజులుగా మెదక్ జిల్లాలోని కొల్చారం మండలానికి యూరియా రాకపోవడంతో శనివారం రంగంపేటలో రైతులు రాస్తారోకో చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం కొల్చారం మండలంలోని రంగంపేట సహకార సంఘం, కొల్చారం సహకార సంఘం, దుంపల కుంట ఆగ్ర
యూరియా రైతులు


మెదక్, 31 ఆగస్టు (హి.స.)

గత 15 రోజులుగా మెదక్ జిల్లాలోని కొల్చారం మండలానికి యూరియా రాకపోవడంతో శనివారం రంగంపేటలో రైతులు రాస్తారోకో చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం కొల్చారం మండలంలోని రంగంపేట సహకార సంఘం, కొల్చారం సహకార సంఘం, దుంపల కుంట ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాలకు మూడు లారీల యూరియాను అధికారులు సరఫరా చేశారు. దీంతో మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున రైతు వేదికల వద్దకు వచ్చేశారు. అయితే ఓకేసారి రైతులు వేదికల వద్దకు చేరుకోవడంతో ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. పోలీసులు ఆయా రైతు వేదికల వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పి వరుస క్రమంలో నిలబెట్టారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లు జారీ చేశారు. అధికారులు ఇచ్చిన టోకెన్లు ఆధారంగా ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియాను సహకార సంఘం సిబ్బంది, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం సిబ్బంది పంపిణీ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande