తెలంగాణ, నల్గొండ. 31 ఆగస్టు (హి.స.)
నల్లగొండ పట్టణం మైసయ్య గౌడ్ విగ్రహం వద్ద ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను బీజేపీ శ్రేణులు దహనం చేశారు. బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆందోళన చేపట్టారు. బీజేపీ నాయకులు ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పలువురు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు