అమరావతి, 31 ఆగస్టు (హి.స.)
విద్యానగర్: గుంటూరు జిల్లా విద్యానగర్‌లో ఎంఎన్‌కే యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ ఉత్సవాల్లో రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ, హీరో నారా రోహిత్ పాల్గొన్నారు. వారితోపాటు హీరోయిన్ వృతి వాఘాని, దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడికి ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిత్రబృందం గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించింది. మొదటి నుంచి విభిన్న చిత్రాలతో మెప్పిస్తున్న నారా రోహిత్.. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ చూడదగ్గ చక్కటి హాస్య ప్రేమకథా చిత్రంతో మన ముందుకు వచ్చారని మన్నవ మోహన కృష్ణ అన్నారు. వినాయకచవితి రోజున విడుదలైన ఈ చిత్రం విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయవంతమైన చిత్రాలు నారా రోహిత్ తీయాలని ఆయన ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ