శ్రీనగర్/న్యూఢిల్లీ,31 ,ఆగస్టు (హి.స.) ఉగ్రవాద నెట్‌వర్కులో ‘మానవ జీపీఎస్’గా పేరొందిన బాగూఖాన్ అలియాస్ సమందర్ చాచాను శనివారం భద్రతా దళాలు జమ్మూకశ్మీర్‌లోని గురెజ్ లోయలో హతమార్చాయి. బాగూఖాన్ మరో ఉగ్రవాదితో కలిసి దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తుండగా నౌషేరా నార్ ప్రాంతం వద్ద కాల్చి చంపారు. బాగూఖాన్ 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. గురెజ్ సెక్టారులోని పలు ప్రాంతాల నుంచి వంద మందికి పైగా చొరబాటుదారులకు ఇతడు సదుపాయాలు కల్పించినట్లు భద్రతా దళాల సమాచారం. ఈ ప్రాంతంలోని కఠినమైన పర్వత మార్గాలు, రహస్య స్థావరాల పరిజ్ఞానం గల బాగూఖాన్‌కు ఉగ్రమూకల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో హిజ్బుల్ కమాండర్‌గానూ పనిచేశాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ