బీసీ రిజర్వేషన్లపై గంగుల వర్సెస్ మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు రచ్చ.
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గంగుల కమాలకర్ పై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. సభలో గంగుల మాట్లాడుతూ.. మంత్రికి వాస్తవాలు తెలియద
గంగుల వర్సెస్ మంత్రులు


హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గంగుల కమాలకర్ పై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. సభలో గంగుల మాట్లాడుతూ.. మంత్రికి వాస్తవాలు తెలియదు.. నేను అడిగిన వాటికి సీఎం క్లారిటీ ఇవ్వాలి అని అన్నారు. గంగులు వ్యాఖ్యలతో హీట్ పెరిగింది. ఆకారాలు పెద్దగ ఉంటే.. అవగాహన ఎక్కువ ఉంటది అనుకోవద్దు అని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. అవగాహన లేదు అంటున్నారు.. ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాను. రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి ఉన్నా.. మంత్రికి అవగాహన లేదని మాట్లాడటం పొరపాటు.. గంగుల వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీనికి బదులుగా గంగుల మాట్లాడుతూ.. నేను బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే చాలా కాంట్రవర్సీ అవుతుంది. ముఖ్యమంత్రి సభలో ఉన్నారు. నేను తప్పు మాట్లాడలేదు.. అతనికి అవగాహన లేదని ఎందుకు అన్నానంటే.. అని చెప్పబోతుండగా.. ముఖ్యమైన బిల్లుపై చర్చ జరుగుతుంటే చిన్న చిన్న అంశాలను పట్టుకుని రాద్దాంతం చేయడం కరెక్ట్ కాదన్నారు శ్రీధర్ బాబు. మంత్రిని ఉద్దేశించి అవగాహన లేదని మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రిని.. బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లుపై చర్చ జరుగుతుంటే ఇలా మాట్లాడడం సరికాదన్నారు. సభా సంప్రదాయాలకు విరుద్దంగా మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande