రెండోరోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ.. సభ ముందుకు కీలక బిల్లులు
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.) రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాజిరెడ్డి, మదన్ లాల్ లకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. మంత్రి శీధర్ బాబు పంచాయతీ రాజ్ చట్ట సవరణ, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్
అసెంబ్లీ


హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)

రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ

సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాజిరెడ్డి, మదన్ లాల్ లకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. మంత్రి శీధర్ బాబు పంచాయతీ రాజ్ చట్ట సవరణ, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. నేడు సభలో 665 పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సభలో తీవ్రమైన చర్చ జరగనుంది.

సభ ప్రారంభంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు జీవో 49పై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చారు. కాగా.. కాళేశ్వరం కమిషన్ పై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande