హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)
తమ కష్టానికి తగిన వేతనం
పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిల్మ్ కార్మికులు బందు పాటించిన విషయం తెలిసిందే. 30 శాతం వేతనాలు పెంచుతూ నిర్మాతలు ప్రకటన చేసే వరకు తాము షూటింగ్లలో పాల్గొనబోమని ఈ నెల 3న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది. అనంతరం నాలుగు నుంచి సమ్మె ప్రారంభం అయిన విషయం తెలిసిందే. వివిధ అంశాలపై ప్రొడ్యూసర్లు, కార్మిక సంఘాలు, ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయిన తర్వాత.. ఎవరూ ఊహించని విధంగా ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రకటన చేసింది. 15 శాతం వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఉదయం కార్మిక సంఘాలకు ఫిల్మ్ ఛాంబర్ లేఖలు పంపింది. అయితే మొదటి నుంచి 30 శాతం వేతనాల పెంపుకు డిమాండ్ చేస్తున్న సినీ కార్మికులు.. 15 శాతం వేతనాల పెంపు నిర్ణయంపై ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు