యాదగిరి నర్సన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి భువనగిరి, 31 ఆగస్టు (హి.స.) యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్మి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి క్యూలై
యాదగిరి నర్సన్న


యాదాద్రి భువనగిరి, 31 ఆగస్టు (హి.స.)

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్మి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కల్యాణంలో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు ఒక గంట, ప్రత్యేక దర్శనానికి దాదాపు అర గంట సమయం పడుతుంది. శ్రీ స్వామివారి ప్రసాదం విక్రయ శాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం,కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్ స్టాండ్ లో భక్తుల సందడి నెలకొంది. కల్యాణ కట్ట లో అధిక సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande