లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. 10 మందికి గాయాలు
పల్నాడు , 31 ఆగస్టు (హి.స.)పల్నాడు జిల్లా(Palnadu District)లో రోడ్డు ప్రమాదం జరిగింది. కోటమనెలమలిపురి ఆర్వోబీ వద్ద లారీ(Lorry)ని ఆర్టీసీ బస్సు(Rtc Bus) కొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్రోసూరు నుంచి పిడుగురాళ్ల(Piduguralla)కు బస్
లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. 10 మందికి గాయాలు


పల్నాడు , 31 ఆగస్టు (హి.స.)పల్నాడు జిల్లా(Palnadu District)లో రోడ్డు ప్రమాదం జరిగింది. కోటమనెలమలిపురి ఆర్వోబీ వద్ద లారీ(Lorry)ని ఆర్టీసీ బస్సు(Rtc Bus) కొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్రోసూరు నుంచి పిడుగురాళ్ల(Piduguralla)కు బస్సు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు నుంచి పక్కకు తీశారు. ప్రమాదంలో నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటన కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande