నంద్యాల ప్రజలకు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు
నంద్యాల, 31 ఆగస్టు (హి.స.)నంద్యాల(Nandyala) ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. తిరుపతి(Tirupati) వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది . సెప్టెంబర్ 9 నుంచి నవంబర్ 25 వరకు తిరుపతి – చర్లపల్లి – నంద్యాల రూట్‌లో స్పె
Train


నంద్యాల, 31 ఆగస్టు (హి.స.)నంద్యాల(Nandyala) ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. తిరుపతి(Tirupati) వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది

. సెప్టెంబర్ 9 నుంచి నవంబర్ 25 వరకు తిరుపతి – చర్లపల్లి – నంద్యాల రూట్‌లో స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించింది. 07013 తిరుపతి – చర్లపల్లి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం రాత్రి 9:10 గంటలకు బయలుదేరి, బద్వేల్, నంద్యాల, ఎమిగనూరు, ఆదోని వంటి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొంది.

తిరుగు ప్రయాణంగా 07014 చర్లపల్లి – తిరుపతి రైలు ప్రతి బుధవారం మధ్యాహ్నం 4:40కు బయలుదేరి, రాత్రి 10:25 గంటలకు నంద్యాలకు చేరుకుంటుందని ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మొత్తం 12 ప్రత్యేక రైళ్లు నడపుతున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రైల్వే శాఖకు నంద్యాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande