గుంటూరు, 31 ఆగస్టు (హి.స.)వినాయక చవితి వేడుకల్లో గణపతి లడ్డూకి ప్రత్యేకత ఉంటుంది. గణనాథుడికి ప్రియమైన నైవేద్యం లడ్డూ అని చెబుతారు. నిమజ్జన సమయంలో దీనిని వేలం వేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ ఏడాది గణపతి వేడుకల్లో ఏపీలో రెండు టన్నుల గణపతి లడ్డూని తయారు చేశారు.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్‌లో 2 టన్నుల తినుబండారాలతో రూపొందించిన గణనాధుని లడ్డూ పలువురిని ఆకట్టుకుంటోంది. స్థానిక మిఠాయి దుకాణ నిర్వాహకులు 2వేల కిలోల లడ్డూను శివలింగాకృతిలో తీర్చిదిద్దారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి