గుడివాడ వైకాపా.నేత మాజీ మంత్రి కొడాలి నాని కి విశాఖ పోలీసులు నోటీసులు అందజేశారు
గుడివాడ, 4 ఆగస్టు (హి.స.), , గుడివాడ వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నానికి విశాఖ పోలీసులు శనివారం రాత్రి 41 సీఆర్‌పీసీ నోటీసులను అందజేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ వ్యాఖ్యలు చేయడంతోపాటు వారిని కించపరిచేలా
గుడివాడ వైకాపా.నేత మాజీ మంత్రి కొడాలి నాని కి విశాఖ పోలీసులు నోటీసులు  అందజేశారు


గుడివాడ, 4 ఆగస్టు (హి.స.), , గుడివాడ వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నానికి విశాఖ పోలీసులు శనివారం రాత్రి 41 సీఆర్‌పీసీ నోటీసులను అందజేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ వ్యాఖ్యలు చేయడంతోపాటు వారిని కించపరిచేలా సామాజిక మాధ్యమాలలో కొడాలి నాని పోస్టులను పెట్టారని.. విశాఖకు చెందిన ఎస్‌.అంజనాప్రియ 2024లో మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సెక్షన్‌ 351(4), 352, 353(2), 196(1), బీఎన్‌ఎస్‌ 467, ఐటీ చట్టం కింద కొడాలిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు నోటీసులనే గుడివాడకు వచ్చి నానికి అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande