త్వరలోనే పట్టాలెక్కనున్న తొలి బుల్లెట్‌ రైలు: వైష్ణవ్‌
భావ్‌నగర్‌::4 ఆగస్టు (హి.స.) దేశంలో తొలి బుల్లెట్‌ రైలు అతి త్వరలో ముంబయి- అహ్మదాబాద్‌ మధ్య అందుబాటులోకి రాబోతోందని, ఇది రెండు గంటల ఏడు నిమిషాల్లో గమ్యాన్ని చేరుకుంటుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఆదివారం భావ్‌నగర్‌ నుంచి మూడు ర
Vande Bharat train service


భావ్‌నగర్‌::4 ఆగస్టు (హి.స.) దేశంలో తొలి బుల్లెట్‌ రైలు అతి త్వరలో ముంబయి- అహ్మదాబాద్‌ మధ్య అందుబాటులోకి రాబోతోందని, ఇది రెండు గంటల ఏడు నిమిషాల్లో గమ్యాన్ని చేరుకుంటుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఆదివారం భావ్‌నగర్‌ నుంచి మూడు రైళ్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. బుల్లెట్‌ రైలు గంటకు 302 కి.మీ. గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు. నరేంద్రమోదీ సర్కారులో 11 ఏళ్ల హయాంలో 34 వేల కి.మీ. నూతన రైలు మార్గాల నిర్మాణం పూర్తయిందని, రోజుకు సగటున 12 కి.మీ. చొప్పున ఇవి తయారవుతున్నాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande