దిల్లీ:4 ఆగస్టు (హి.స.) ఎన్నికల సంఘం(ఈసీ)పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో ఓటర్ల జాబితాపై చేస్తున్న ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్)తో ఈసీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రాల ఎన్నికల స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దీన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. ‘‘బిహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. తమిళనాడులో 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఇది చట్టవిరుద్ధం. ఆందోళన కలిగించే విషయం’’ అని చిదంబరం ఆందోళన వ్యక్తంచేశారు. అయితే చిదంబరం వ్యాఖ్యలను నిరాధారమైనవిగా, తప్పుదోవ పట్టించేవిగా ఈసీ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ