కర్నూలు, 4 ఆగస్టు (హి.స.)వర్షాకాలంలో సాధారణంగా రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే, ఈ కాలంలో వాతావరణంలో తేమ పెరిగి, దోమలు, ఈగలు, ఇతర క్రిములు వృద్ధి చెందుతాయి. వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కామెర్లు, జలుబు, దగ్గు వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి, వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే, వర్షాకాలంలో ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని, ఎలాంటి రోగాలు రావని చాలా మంది అంటారు. అయితే ఇందులో నిజమెంత? వర్షాకాలంలో వేడి నీరు ఎందుకు తాగాలి? అలా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణశక్తి పెరుగుతుంది
వర్షాకాలంలో వేడి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. మీరు వేడి నీరు తాగినప్పుడు, శరీరం నుండి పేరుకుపోయిన విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది కడుపును శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వర్షాకాలంలో కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి, వేడి నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి