రాయలసీమ వర్సిటీకి గూగుల్ బిగ్ షాక్.. అధికారిక వెబ్‌సైట్ తొలగింపు
అమరావతి, 4 ఆగస్టు (హి.స.)రాయలసీమ వర్సిటీకి గూగుల్బిగ్ షాక్ ఇచ్చింది. వర్సిటీ వెబ్ సైట్‌(Website)ను తొలగించింది. రెన్యూవల్ చేయని కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వర్సిటీలో పీజీ సెట్ ప్రవేశాలు, పరీక్షలు, ఫలితాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారిక వెబ్
రాయలసీమ వర్సిటీకి గూగుల్ బిగ్ షాక్.. అధికారిక వెబ్‌సైట్ తొలగింపు


అమరావతి, 4 ఆగస్టు (హి.స.)రాయలసీమ వర్సిటీకి గూగుల్బిగ్ షాక్ ఇచ్చింది. వర్సిటీ వెబ్ సైట్‌(Website)ను తొలగించింది. రెన్యూవల్ చేయని కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వర్సిటీలో పీజీ సెట్ ప్రవేశాలు, పరీక్షలు, ఫలితాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారిక వెబ్ సైట్ తొలగించడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం వెంటనే స్పందించింది వెబ్ సైట్‌ను రెన్యూవల్ చేయాలని కోరుతున్నారు. లేని పక్షంలో వర్సిటీలో ప్రవేశాల్లో చాలా మంది విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అటు గూగుల్ యాజమాన్యం కూడా పరిస్థితులను అర్ధం చేసుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. వర్సిటీ యాజమాన్యం స్పందన, గూగుల్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande