లఖ్‌నవూ: :4 ఆగస్టు (హి.స.)ఉత్తర భారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దిల్లీలో ఆదివారం ఉదయం భారీవర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వారణాసిలో గంగానది నీటిమట్టం 71.50 మీటర్లకు చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానల కారణంగా రెండు జాతీయ రహదారులతో పాటు 370 రోడ్లను మూసివేశారు. సోమ, మంగళవారాల్లో ఈ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ