ఇజ్రాయెల్‌ బందీల దీనస్థితి.. మానవతా సాయంపై మెత్తబడిన హమాస్‌
దిల్లీ:4 ఆగస్టు (హి.స.)ఇజ్రాయెల్‌ (Israel) భీకర దాడులతో గాజాలో (Gaza) దుర్భర పరిస్థితులు తలెత్తాయి. అక్కడి ప్రజల పరిస్థితి అత్యంతదారుణంగా మారిపోయింది. మరోవైపు హమాస్‌ (Hamas) చెరలో ఉన్న ఇజ్రాయెల్‌ బందీలు (Hostages) ఆకలితో అలమటిస్తున్నారు. ఇటీవల అక్కడి
పోసోే


దిల్లీ:4 ఆగస్టు (హి.స.)ఇజ్రాయెల్‌ (Israel) భీకర దాడులతో గాజాలో (Gaza) దుర్భర పరిస్థితులు తలెత్తాయి. అక్కడి ప్రజల పరిస్థితి అత్యంతదారుణంగా మారిపోయింది. మరోవైపు హమాస్‌ (Hamas) చెరలో ఉన్న ఇజ్రాయెల్‌ బందీలు (Hostages) ఆకలితో అలమటిస్తున్నారు. ఇటీవల అక్కడి బందీలకు సంబంధించిన పలు దృశ్యాలు, వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో ఇజ్రాయెలీలు ఎముకల గూళ్లుగా మారిన శరీరాలతో దారుణస్థితిలో కనిపించడంపై ఆ దేశ ప్రధాని నెతన్యాహు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. హమాస్‌ చెరలోని తమ బందీలకు మానవతా సాయం అందేలా చూడాలని రెడ్‌క్రాస్‌ సంస్థను కోరారు. ఇన్నాళ్లు ఇజ్రాయెల్‌ బందీల (Hostages)ను తీవ్ర హింసలకు గురిచేసిన హమాస్‌ సైతం ఈ విషయంలో కొంతమేరకు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ తమ షరతులకు అనుగుణంగా వ్యవహరిస్తే.. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్‌ బందీలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సహాయాన్ని అందించడానికి కేవలం అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ కమిటీని మాత్రమే అనుమతిస్తామని వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande