రాజధాని నడిబొడ్డున ఉన్న కేబీ ఆర్ పార్కు చుట్టూ రూ.1090 కోట్లతో పై వంతెన అండర్ పాస్ ల నిర్మాణం
హైదరాబాద్‌, 4 ఆగస్టు (హి.స.) : రాజధాని నడిబొడ్డున ఉన్న కేబీఆర్‌ పార్కు చుట్టూ రూ.1090 కోట్లతో పైవంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం జరగబోతోంది. నిర్మాణ పనులతో పార్కు చుట్టూ ఎకో సెన్సిటివ్‌ జోన్‌ (ఈఎస్‌జెడ్‌) దెబ్బతింటుందని, చెట్లను పెద్దఎత్తున తొలగించాల్
రాజధాని నడిబొడ్డున ఉన్న కేబీ ఆర్ పార్కు చుట్టూ రూ.1090 కోట్లతో పై వంతెన అండర్ పాస్ ల నిర్మాణం


హైదరాబాద్‌, 4 ఆగస్టు (హి.స.)

: రాజధాని నడిబొడ్డున ఉన్న కేబీఆర్‌ పార్కు చుట్టూ రూ.1090 కోట్లతో పైవంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం జరగబోతోంది. నిర్మాణ పనులతో పార్కు చుట్టూ ఎకో సెన్సిటివ్‌ జోన్‌ (ఈఎస్‌జెడ్‌) దెబ్బతింటుందని, చెట్లను పెద్దఎత్తున తొలగించాల్సి వస్తుందనే అంశాలపై న్యాయస్థానాల్లో దాఖలైన కేసులు కొలిక్కి రావడంతో.. కొత్త డిజైన్లతో పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఉద్యానవనం చుట్టూ ఆరు కూడళ్ల వద్ద 307 ఆస్తులను సేకరించాల్సి ఉండగా.. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande