సనాతన ధర్మంపై నటుడు కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు..
దిల్లీ:4 ఆగస్టు (హి.స.) నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి, ‘‘సనాతన’’ భావాలను ఎదుర్కొనేందుకు విద్య ఏకైక మార్గమని అన్నారు. తమిళ స్టార్ హీరో సూర్య ఏర్పాటు చేసిన అరగం ఫౌండేషన్
Kamal Hassan


దిల్లీ:4 ఆగస్టు (హి.స.)

నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి, ‘‘సనాతన’’ భావాలను ఎదుర్కొనేందుకు విద్య ఏకైక మార్గమని అన్నారు. తమిళ స్టార్ హీరో సూర్య ఏర్పాటు చేసిన అరగం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హసన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘నియంతృత్వం, సనాతన సంకెళ్లను బద్దలు కొట్టగలితే ఏకైక ఆయుధం విద్య’’ అని అన్నారు. జ్ఞానం, సాధికారత వ్యవస్థలలో ఆసక్తి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.

‘‘మీ చేతుల్లో వేరే ఏది ఉండకూడదు, విద్య ఒక్కటే ఉండాలి. అది లేకపోతే మనం గెలవలేము, ఎందుకంటే మెజారిటీ మూర్ఖులు మనల్ని ఒడించగలరు, జ్ఞానం ఓడినట్టే కనిపించొచ్చు. కానీ అదే మన ఆస్తి. అందుకే దానిని సాధించాలి’’ అని కమల్ హాసన్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande