స్తంభాన్ని ఢీకొన్న బైక్.. ఒకరు మృతి
విజయనగరం, 4 ఆగస్టు (హి.స.)జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రామచంద్రాపురం మండలం జన్నివలస సమీపంలో అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ వెలమల ప్రసాద్ తెలిపారు. నేరెళ్లవలసకు చెందిన కుడుమూరు కన్నయ్య దొర(2
స్తంభాన్ని ఢీకొన్న బైక్.. ఒకరు మృతి


విజయనగరం, 4 ఆగస్టు (హి.స.)జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రామచంద్రాపురం మండలం జన్నివలస సమీపంలో అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ వెలమల ప్రసాద్ తెలిపారు. నేరెళ్లవలసకు చెందిన కుడుమూరు కన్నయ్య దొర(26) పని ముగించుకొని రామభద్రపురం నుంచి ఇంటికి బైక్ పై వెళ్తుండగా జన్నివలస సమీపంలో బైక్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో మరుసటి రోజు ఆదివారం ఉదయం అటువైపు వాకింగ్ వెళ్తున్న కొంతమంది గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande