ములకలచెరువు, 4 ఆగస్టు (హి.స.)ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోరమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ములకలచెరువు మండలం, కట్టవాండ్లపల్లి దగ్గర వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని వెంకటేష్, తరుణ్, మనోజ్ గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి