కాకినాడ.కార్పొరేషన్లలో వైసిపి హయాంలో టీ డీ ఆర్ బాండ్ల కుంభకోణం
కాకినాడ, 5 ఆగస్టు (హి.స.)కాకినాడ కార్పొరేషన్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జారీచేసిన రూ.411కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ల జారీ కుంభకోణంపైబాధ్యులపై భర్యలకు తీవ్ర జాప్యం జరుగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరిగి ప్రభుత
కాకినాడ.కార్పొరేషన్లలో వైసిపి హయాంలో టీ డీ ఆర్ బాండ్ల కుంభకోణం


కాకినాడ, 5 ఆగస్టు (హి.స.)కాకినాడ కార్పొరేషన్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జారీచేసిన రూ.411కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ల జారీ కుంభకోణంపైబాధ్యులపై భర్యలకు తీవ్ర జాప్యం జరుగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరిగి ప్రభుత్వానికి నివేదిక వెళ్లింది. ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఆక్రమార్కులపై కనీసం చర్యలు ఉండడంలేదు. నివేదికలో అప్పటి వైసీపీ కీలకనేత, ఆయనకు సహకరించిన కొందరు అధికారులు ఏ స్థాయిలో అడ్డగోలుగా వ్యవహారించారో తేలింది. బాధ్యులు టీడీఆర్ బాండ్ల జారీతో కార్పొరేషన్ ఆదాయానికి కోట్లలో గండికొట్టారని తేల్చింది. ఎన్నో స్థలాలున్నా కేవలం కొందరికి లబ్ధి చేకూర్చడం కోసమే టీడీఆర్ నాటకం ఆడారని తేలిపోయింది. ఇవన్నీ కూలంకషంగా ప్రభుత్వానికి అందిన నివేదికలో ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించే చిన్న పురోగతి కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande