ఆదిలాబాద్ ఎస్పీ వినూత్న ఆలోచన! కటౌట్లతో ప్రమాదాల కట్టడి..!
ఆదిలాబాద్, 5 ఆగస్టు (హి.స.) జాతీయ రహదారిపై వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలను అరికట్టడానికి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దూర దృష్టి, మేధాశక్తి తో జిల్లాలో నూతనంగా జాతీయ రహదారి - 44 పై ప్రమాదాల నివారణకు వినూత్న రీతిలో చర్యలు తీసుకున్నారు. హైవేపై..
ఆదిలాబాద్ ఎస్పీ


ఆదిలాబాద్, 5 ఆగస్టు (హి.స.) జాతీయ రహదారిపై వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలను అరికట్టడానికి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దూర దృష్టి, మేధాశక్తి తో జిల్లాలో నూతనంగా జాతీయ రహదారి - 44 పై ప్రమాదాల నివారణకు వినూత్న రీతిలో చర్యలు తీసుకున్నారు.

హైవేపై.. అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ వేగ నియంత్రణ కోసం ప్రత్యేకంగా డయల్ 100 వాహనం, ట్రాఫిక్ కానిస్టేబుల్ తో కూడిన కటౌట్ లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు వాహనదారులు వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా కృషి చేస్తున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వాహనం మరియు పోలీసులు ఉంటేనే వాహనదారులు సరైన ట్రాఫిక్ నియమ నిబంధనలు, వేగ నియంత్రణ పాటిస్తూ ప్రమాదాలకు గురికాకుండా ఉంటారని తెలిపారు. వాహనదారులకు స్వీయ వేగ నియంత్రణ లేకపోవడం ద్వారా గత రెండు సంవత్సరాలలో ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని.. ఆ ప్రదేశాలను గుర్తించి ప్రాణనష్టాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా కటౌట్లను చేశామన్నారు. ఈ కటౌట్లు చూసి వాహనదారులు బ్రేకులు వేస్తూ.. వేగాన్ని తగ్గిస్తున్నారని.. హెల్మెట్ ధరిస్తున్నారని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande