అమరావతి, 5 ఆగస్టు (హి.స.) ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ(మంగళవారం), రేపు (బుధవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు(పడనున్నాయి. కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లో వానలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ