హైదరాబాద్, 5 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్‌లో నిన్న కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు గచ్చిబౌలిలో పిడుగు పడింది. ఖాజాగూడలోని ల్యాంకోహిల్స్ సర్కిల్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టుపై భారీ శబ్దంతో పిడింది. భారీ శబ్దం రావడంతో జనాలు ఒక్కసారిగా పరుగులు తీశారు. పిడుగు ధాటికి తాటి చెట్టుకు మంటలంటుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. వారం రోజుల గ్యాప్ తర్వాత.. మళ్లీ వరుణుడు హైదరాబాద్‌ను ముంచేశాడు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్ షుఖ్ నగర్, నాగోలు, హయత్ నగర్, ఎస్.ఆర్.నగర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో భారీ వర్షం కురిసింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు