హైదరాబాద్, 5 ఆగస్టు (హి.స.)హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో హత్య ఘటన వెలుగు చూసింది. దుండగులు ఆటోలో వచ్చి విచక్షణ రహితంగా చంపారు. గుడ్ విల్ హోటల్లో చాయ్ తాగుతున్న సమయంలో ఓ వ్యక్తి పై దాడి చేశారు. చనిపోయిన వ్యక్తి నీ మహబూబ్ గా గుర్తించారు. కత్తులు, కొబ్బరి బొండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపారు. హత్యాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
నలుగురు వ్యక్తులు గొడవపడి ఓ వ్యక్తి నీ హత్య చేసినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు