అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ, మేడ్చల్ మల్కాజిగిరి. 5 ఆగస్టు (హి.స.) అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గంలోని ఐదు మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు,
మంత్రి శ్రీధర్ బాబు


తెలంగాణ, మేడ్చల్ మల్కాజిగిరి. 5 ఆగస్టు (హి.స.)

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ

పథకాలు అందేలా చూస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గంలోని ఐదు మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, కలెక్టర్ మనుచౌదరి తో కలిసి మంగళవారం మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఉద్ఘాటించారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతికేలా ఉండడానికి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం అందచేస్తున్నామని అన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 40 వేల రేషన్ కార్డులు అందచేసామని, లక్ష మంది రేషన్ కార్డులో చేర్పులు చేపడుతున్నట్లు తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ సేవల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన రేషన్ కార్డులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande