ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్యా, వైద్యానికి పెద్దపీట : మంత్రి పొంగులేటి
తెలంగాణ, ఖమ్మం. 5 ఆగస్టు (హి.స.) యంగ్ ఇండియా స్కూళ్లతో కొత్త విద్యా యుగానికి నాంది పలుకుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో మంగళవారం 191 మంది బాలికలకు సైకిళ్లను జిల్లా కలెక్టర్ త
మంత్రి పొంగులేటి


తెలంగాణ, ఖమ్మం. 5 ఆగస్టు (హి.స.)

యంగ్ ఇండియా స్కూళ్లతో కొత్త

విద్యా యుగానికి నాంది పలుకుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో మంగళవారం 191 మంది బాలికలకు సైకిళ్లను జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇప్పటికే 8, 9, 10వ తరగతి విద్యార్థులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు ఇచ్చామని, వచ్చే ఏడాది నుంచి జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా సైకిళ్లు అందజేయనున్నాం అని హామీ ఇచ్చారు.

గతంలో విద్యలో వెనుకబడిన ఈ ప్రాంతానికి ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే రూ. 470 కోట్లను విద్యాభివృద్ధికి కేటాయించామని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande