మక్తల్ ప్రభుత్వాసుపత్రి నిర్మాణం పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
తెలంగాణ, నారాయణపేట. 5 ఆగస్టు (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మక్తల్ శివారులో పదెకరాల ప్రభుత్వ భూమిలో రూ.34 క
నారాయణపేట కలెక్టర్


తెలంగాణ, నారాయణపేట. 5 ఆగస్టు (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మక్తల్ శివారులో పదెకరాల ప్రభుత్వ భూమిలో రూ.34 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె సంబంధిత కాంట్రాక్టర్లకు మరియు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అంతేకాక, కృష్ణా మండల కేంద్రంలోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.156 లక్షల నిధులతో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. మైల్డ్ స్టోన్ ప్రకారం పనులు వేగంగా పూర్తవ్వాలని ఆమె సూచించారు. ఆసుపత్రి భవన నిర్మాణ నమూనా ను కూడా ఆమె పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande