ప్రజాపాలనలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు : నర్సంపేట ఎమ్మెల్యే
వరంగల్, 5 ఆగస్టు (హి.స.) ప్రజా ప్రభుత్వం లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలకేంద్రంలో రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ క
నర్సంపేట ఎమ్మెల్యే


వరంగల్, 5 ఆగస్టు (హి.స.)

ప్రజా ప్రభుత్వం లో అర్హులైన ప్రతి

ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలకేంద్రంలో రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేస్తున్నామని ప్రస్తుతం 440 కొత్త కార్డులకు మంజూరు ఇచ్చి అందిస్తున్నామని తెలిపారు. ఇంకా మిగిలిన వారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతి నెల మండలానికి 7 నుంచి 8 వేల క్వింటాల బియ్యం మండలానికి ప్రతినెలా అందిస్తున్నామని, సివిల్ సప్లై అధికారులతో మాట్లాడి కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు కూడా వచ్చే నేల నుండి బియ్యం అందిచనున్నట్లు తెలిపారు.

మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్దిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి రెండో విడుతలో ఎంపిక కాబడే లబ్దిదారులకు సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో ఇప్పటికే 3500 ఇండ్ల తో పాటుగా ట్రైబల్ ఏరియాలో 250 ఇండ్లను మంజూరు చేశామని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande