మహిళలు పకడ్బందీగా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలి.. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 5 ఆగస్టు (హి.స.) ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం పొందిన మహిళలు పకడ్బందీగా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షి
సిరిసిల్ల జిల్లా కలెక్టర్


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 5 ఆగస్టు (హి.స.)

ఇందిరా మహిళా శక్తి కింద

ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం పొందిన మహిళలు పకడ్బందీగా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. ఇందిరా మహిళా పథకం కింద సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తన్నపేట గ్రామంలో విశ్వ దర్శనీ గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాలు దుకాణాన్ని కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డెయిరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు.

త్వరలో ఇందిరా మహిళా శక్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యలో ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలు ప్రారంభించామని వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande