గుంటూరు.జీజీహెచ్ .వైద్యులు అరుదైన శాస్త్ర చికిత్స.చేశారు
అమరావతి, 5 ఆగస్టు (హి.స.) గుంటూరు: గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ముఖంపై కణితితో బాధపడుతున్న ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్వీ రమణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రత్తిపాడుక
గుంటూరు.జీజీహెచ్ .వైద్యులు అరుదైన శాస్త్ర చికిత్స.చేశారు


అమరావతి, 5 ఆగస్టు (హి.స.)

గుంటూరు: గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ముఖంపై కణితితో బాధపడుతున్న ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్వీ రమణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రత్తిపాడుకు చెందిన అశోక్‌ చాలాకాలంగా ముఖంపై కణితితో బాధపడుతున్నారు. ఇటీవల జీజీహెచ్‌కు రాగా.. పరీక్షలు నిర్వహించి పారోటిడ్‌ కార్సినోమా ఉన్నట్లు గుర్తించాం. అది క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉండటంతో వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయించాం. ఫ్రొఫెసర్‌ కిరణ్‌ కుమార్‌ బృందం విజయవంతంగా ఆ సర్జరీని పూర్తి చేసింది. రూ.4లక్షల వరకు ఖర్చయ్యే సర్జరీని ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద ఉచితంగా చేశాం’’అని చెప్పారు.

కణితితో ఎంతో ఇబ్బంది పడుతున్న అశోక్‌కు ధైర్యం చెప్పి సర్జరీ చేసినట్లు ప్రొఫెసర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. తమ వైద్యుల బృందం నాలుగు గంటలు శ్రమించి సర్జరీని పూర్తి చేసినట్లు చెప్పారు. పేషెంట్‌కి పూర్తిగా మత్తుమందు ఇచ్చి, ముఖ కండరాలు దెబ్బతినకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సర్జరీ చేశామన్నారు. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది సహకారంతో సర్జరీ విజయవంతమైందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande