తృటిలో తప్పిన ప్రమాదం.. బంజారాహిల్స్ నాలా పై కుంగిన రోడ్డు
హైదరాబాద్, 5 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ సిటీలో నడి బొడ్డున.. ప్రముఖులు నివాసం ఉండే బంజారాహిల్స్ రోడ్డు కుంగిపోయింది. మంగళవారం ఉదయం బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 లో రోడ్డు కుంగిపోవడంతో వాటర్ ట్యాంకర్ నాలాలో పడిపోయింది. రోడ్డు మొత్తం ఒక్కసారిగా కుంగిపోవడ
బంజారాహిల్స్ నాలా పై


హైదరాబాద్, 5 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్ సిటీలో నడి బొడ్డున..

ప్రముఖులు నివాసం ఉండే బంజారాహిల్స్ రోడ్డు కుంగిపోయింది. మంగళవారం ఉదయం బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 లో రోడ్డు కుంగిపోవడంతో వాటర్ ట్యాంకర్ నాలాలో పడిపోయింది. రోడ్డు మొత్తం ఒక్కసారిగా కుంగిపోవడంతో లోడ్ తో వెళ్తున్న వాటర్ ట్యాంకర్ నాలాలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. నాలా పై ఉన్న రోడ్డు నిన్న కురిసిన వర్షపు నీటి ధాటికి కూలిపోయింది. అదే సమయంలో ఆ రోడ్డు పై వెళుతున్న పెద్ద వాటర్ ట్యాంకర్ దిగపడిపోవటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన పై స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు నాలాలో ఇరుక్కుపోయిన వాటర్ ట్యాంకర్ ను బయటికి తీసే పనిలో పడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande