హైదరాబాద్, 5 ఆగస్టు (హి.స.)
తమ్మిడిహట్టి వద్ద అగ్రిమెంట్ జరిగి ఉంటే.. ఏడెండ్లు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి ఎత్తలేదని ప్రస్తుత నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం రిపోర్టుపై ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో హరీశ్రవు మాట్లాడారు.
2007 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తమ్మిడిహట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు. ఇప్పుడు కూడా రెండేండ్లు అవుతుంది. తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మంట్టి ఎందుకు ఎత్తలేదు. ఏ బేసిస్లో నిర్ణయించారు. నీటి లభ్యత లేదు. మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు తమ్మిడిహట్టి వద్ద. మేడిగట్ట మీద మేం పెట్టేందుక ఒక బేసిస్ ఉంది. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు, నాటి నుంచి నేటి వరకు గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారు. మహారాష్ట్రతో కేసీఆర్ నీళ్లు ఇచ్చి పుచ్చుకునే ఒక చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేము 152 మీటర్లకు తమ్మిడిహట్టి వద్ద అగ్రిమెంట్ చేస్తే మీరు ఎలా తగ్గిస్తారని మాట్లాడాడు. దానికి కేసీఆర్ మాట్లాడుతూ నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినట్టు నిరూపిస్తే నేను ఇంటికి పోకుండా, నేరుగా రాజ్భవన్కు వెళ్లి రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడని హరీశ్రావు గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్