ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు షాక్.. రోడ్డెక్కిన డెలివరీ బాయ్స్
హైదరాబాద్, 5 ఆగస్టు (హి.స.) ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు ఊహించిన షాక్ తగిలింది. ఈ మేరకు ఇవాళ నగరంలోని ఉప్పల్లో జొమాటో డెలివరీ బాయ్స్ ఆకస్మిక ఆందోళన చేపట్టారు. రోజంతా కష్టపడినా.. రెండు, మూడు నెలల నుంచి చేసిన కష్టానికి సరిపడా డబ్బులు రావడం లేదన
జొమాటో బాయ్స్


హైదరాబాద్, 5 ఆగస్టు (హి.స.)

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు ఊహించిన షాక్ తగిలింది. ఈ మేరకు ఇవాళ నగరంలోని ఉప్పల్లో జొమాటో డెలివరీ బాయ్స్ ఆకస్మిక ఆందోళన చేపట్టారు. రోజంతా కష్టపడినా.. రెండు, మూడు నెలల నుంచి చేసిన కష్టానికి సరిపడా డబ్బులు రావడం లేదని ఆరోపించారు. అదేవిధంగా ఇన్సెంటివ్స్ కూడా సరిగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇన్స్టమ్ లో కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేస్తున్న తమకు ఇన్సురెన్స్ కూడా లేదని, రోడ్డు ప్రమాదాల బారిన పడినా తమను పట్టించుకునే నాథుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రటి ఎండలో, భారీ వర్షంలో కస్టమర్ల నుంచి భారీ ఎత్తున టారీఫ్లు జొమాటో వసూలు చేస్తోందని.. అందులో డెలివరీ బాయ్స్ కు మాత్రం పైసా కూడా దక్కడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తే కేసులు పెడతామంటూ జొమాటో యాజమాన్యం బెదిరింపులకు గురి చేస్తోందని.. విషయం ప్రభుత్వం దృష్టి వెళ్లాలనే తాము రోడ్డెక్కామని జొమాటో డెలివరీ బాయ్స్ మీడియాకు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande