తమిళనాడు లోని.నాగపట్నం లో.వెలసిన వెలంకని కి గుంతకల్లు నుంచి ప్రత్యేక రైలు
అనంతపురం 5 ఆగస్టు (హి.స.)తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్‌స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టె
తమిళనాడు లోని.నాగపట్నం లో.వెలసిన వెలంకని కి గుంతకల్లు నుంచి ప్రత్యేక రైలు


అనంతపురం 5 ఆగస్టు (హి.స.)తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్‌స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మిన్‌సలో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (09094) వెలంకనిలో ఈ నెల 30, సెప్టెంబరు 9 తేదీల్లో అర్ధరాత్రి 12-30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం పదిన్నరకు బాంద్రా టెర్మిన్‌సకు చేరుకుటుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande