హైదరాబాద్, 5 ఆగస్టు (హి.స.)
ఇటీవలే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతదేశంలో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది.
గత కొన్ని సంవత్సరాలుగా UPI చాలా వేగంగా ముందుకు సాగుతోంది. 2023 నుంచి దాని రోజువారీ వినియోగాన్ని రెట్టింపు చేసింది. అప్పట్లో, ఇది రోజుకు దాదాపు 35 కోట్లు లావాదేవీలను నిర్వహించేది. ఆ సంఖ్య ఆగస్టు 2024 నాటికి 50 కోట్లకు చేరింది. కాగా ఇప్పుడు తాజాగా ఇది 70 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 100 కోట్ల లావాదేవీలను చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు